23 June, 2026 | 11:31 AM

తెలుగే కదా పండితుడు ఎందుకు అనుకుంటున్నారా?

23-06-2026 10:25 AM

 గత ఏడాది మొత్తం  ఆ ఉపాధ్యాయుడే లేరు 

 సమన్వయం చేయని విద్యాశాఖ 

 ఇకనైనా ఆ ఉపాధ్యాయుని కేటాయించాలని వేడుకలు

మహబూబ్ నగర్: అసలే పదవ తరగతి పదేళ్లు చదివిన విద్యాభ్యాసానికి ఒక ప్రత్యేక గుర్తింపు తో పాటు ఆ విద్యార్థి జీవితంలో చిరస్థాయిగా నిలిచిపోయేది పదవ తరగతి ఫలితం. ప్రభుత్వ పాఠశాలలో చదవండి అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాం అంటూ చెప్పుకోస్తున్న నేతలు అధికారులు పదవ తరగతి ఉన్న పాఠశాలలో కూడా తెలుగు పండిత్ లేని దుస్థితులు ఏర్పడుతున్నాయి అంటే ఆ పాఠశాల లో చదువుతున్న విద్యార్థుల ఆవేదన ఎంత ఉందో అర్థం చేసుకోవాల్సిన పరిస్థితులు ఉంది. చెప్పిన దానికి చేస్తున్న దానికి పొంతన ఉంటే ప్రతి తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలలో చదివించాలని సంకల్పంతో అడుగులు వేస్తారు.

గత ఏడాది మొత్తం మండల పరిధిలోని జూలపల్లి గ్రామంలో ఉన్న జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో తెలుగు పండితు లేకపోయినప్పటికీ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూనే పరీక్షలకు సన్నతమై కొంతమంది ఉత్తీర్ణత సాధించగా ముగ్గురు విద్యార్థులు ఉత్తీర్ణత సాధించలేకపోయారు. ఈ పాఠశాలలో ఉన్న పీడీ గత ఏడాది విద్యార్థులకు తెలుగు బోధించినప్పటికీ ఆ ఉపాధ్యాయుని కూడా ఇటీవల బదిలీ చేయడంతో అక్కడ తెలుగు బోధించే ఉపాధ్యాయుడు లేకపోవడంతో విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని డీఈఓ దృష్టికి తీసుకుపోగా వారం రోజుల్లో తెలుగు పండితుడిని పంపించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటమని తెలియజేశారు. డి ఈ ఓ చెప్పిన మేరకు కొరత ఉన్న ఉపాధ్యాయుని ఆ విద్యార్థులకు పంపిస్తారా లేదా చూడాలి.