4 June, 2026 | 1:20 AM

చిరు వ్యాపారుల డిజిటల్ బజార్

04-06-2026 12:00 AM

ఆశయాలు ఎంత ఆకర్షణీయంగా ఉన్నా, క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సవాళ్లు మాత్రం చిన్నవి కావు. ఓఎన్డీసీ గురించి ఇప్పటికీ సామాన్య వినియోగదారుల్లో సరైన అవగాహన లేదు. దీనికి సొంతంగా ఒక ప్రత్యేక యాప్ లేకపోవడం కూడా గందరగోళానికి కారణమవుతోంది. 

దేశ ఆర్థిక వ్యవస్థలో డిజిటల్ విప్లవానికి ప్రతీకగా నిలిచిన యూపీఐ విజయం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది. ఒకప్పుడు నగదు లేకుంటే లావాదేవీ జరగని పరిస్థితి నుంచి నేడు వీధి చివర టీ దుకాణం నుంచి పెద్ద వ్యాపార సంస్థ వరకు ఒకే క్యూఆర్ కోడ్‌తో చెల్లింపులు స్వీకరించే స్థాయికి దేశం చేరుకుంది. ఇదే విజయాన్ని ఈ- రం గంలోనూ పునరావృతం చేయాలన్న లక్ష్యం తో కేంద్ర ప్రభుత్వం 2021లో ఓపెన్ నెట్‌వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ (ఓఎన్డీసీ)ను ఏర్పాటు చేసింది. 2022లో కొన్ని నగరాల్లో ప్రయోగాత్మకంగా ప్రారంభమైన ఈ వ్యవస్థ ప్రస్తుతం దేశవ్యాప్తంగా విస్తరిస్తోంది. ఆహా రం, కిరాణా, మొబిలిటీ, చేనేత, వ్యవసాయ ఉత్పత్తులు తదితర రంగాలను ఒకే డిజిటల్ నెట్‌వర్క్‌లోకి తీసుకురావాలన్నది దీని ప్రధాన ఉద్దేశం.

ఓఎన్డీసీ. ఒక పెద్ద సంస్కరణ

ఈ- రంగం వేగంగా విస్తరిస్తున్న కొద్దీ మార్కెట్ కొన్ని పెద్ద సంస్థల చుట్టూ కేంద్రీకృతమవుతోందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఆన్‌లైన్ విక్రయాల ద్వారా దేశవ్యాప్తంగా వినియోగదారులను చేరుకోవాలనుకునే చిన్న వ్యాపారులు, స్థానిక తయారీదారులు, హస్తకళాకారులు, స్వయం సహాయక సంఘాల సభ్యులు అనేక అడ్డంకులను ఎదుర్కొంటున్నారు. మార్కెట్లో ప్రవే శానికి ఉన్న అవరోధాలను తగ్గించి, డిజిటల్ వాణిజ్యంలో సమాన అవకాశాలు కల్పించాలన్న ఆలోచన నుంచే ఓఎన్డీసీ పుట్టుకొ చ్చింది. యూపీఐ వివిధ బ్యాంకులను ఒకే చెల్లింపుల వ్యవస్థతో అనుసంధానించినట్లే, ఓఎన్డీసీ వివిధ కొనుగోలు, విక్రయ, రవా ణా సేవలను ఒకే నెట్‌వర్క్‌లోకి తీసుకురావాలని భావిస్తున్నది.

ఆలోచన పరంగా చూస్తే ఇది భారత డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో ఒక పెద్ద సంస్కరణగా చెప్పవచ్చు. ఎందుకంటే ఈ అనేది కేవలం వస్తువుల కొనుగోలు, విక్రయాలకే పరిమితం కాదు. మార్కెట్‌కు ఎవరు చేరగలరు? ఎవరు పోటీ పడగలరు? వినియోగ దారుడికి ఎన్ని ఎంపికలు అందుబాటులో ఉంటాయి? అనే ప్రశ్నలకు కూడా ఇది సమాధానం చెబుతుంది. ఒక చిన్న గ్రామంలోని చేనేత కార్మికుడు లేదా గిరిజన ప్రాం తానికి చెందిన ఉత్పత్తిదారుడు కూడా దేశవ్యాప్తంగా వినియోగదారులను చేరుకునే అవకాశం పొందితేనే డిజిటల్ ఆర్థిక వ్యవస్థ నిజమైన అర్థంలో సమ్మిళిత అభివృద్ధికి దో హదపడుతుంది.

ఎదురవుతున్న అనేక సవాళ్లు

అయితే ఆశయాలు ఎంత ఆకర్షణీయం గా ఉన్నా, క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సవాళ్లు మాత్రం చిన్నవి కావు. ఓఎన్డీసీ గురించి ఇప్పటికీ సామాన్య వినియోగదారుల్లో తగిన అవగాహన లేదు. దీనికి సొం తంగా ఒక ప్రత్యేక యాప్ లేకపోవడం కూడా గందరగోళానికి కారణమవుతోంది. చాలామందికి ఓఎన్డీసీ అనేది ఒక యాప్ కాదని, వివిధ యాప్‌లను అనుసంధానించే ఓపెన్ నెట్‌వర్క్ అని కూడా తెలియదు. ఫలితంగా వ్యవస్థ ఉన్నప్పటికీ వినియోగం ఆశించిన స్థాయికి చేరడం లేదు. ప్రచార లోపం కూడా దీనికి పెద్ద అడ్డంకిగా మారింది. యూపీఐ విజయానికి సాంకేతికతతో పాటు విస్తృత ప్రజా ప్రచారం కూడా ఒక ప్రధాన కారణం. బ్యాంకులు, ప్రభుత్వ సంస్థలు, ప్రైవేట్ సంస్థలు కలిసి ప్రజల్లో నమ్మకాన్ని పెంచాయి.

ఓఎన్డీసీ విషయంలో అలాంటి విస్తృత అవగాహన కార్యక్రమాలు ఇంకా కనిపించడం లేదు. ఫలితంగా డిజిటల్ రం గంపై ఆసక్తి ఉన్నవారికి మాత్రమే దీని గురించి కొంత అవగాహన ఉండగా, సాధారణ వినియోగదారుడికి ఇది ఇంకా పరిచ యం కాని వ్యవస్థగానే మిగిలిపోయింది. చి న్న వ్యాపారుల భాగస్వామ్యాన్ని పెంచాలన్న లక్ష్యం కూడా ఇంకా పూర్తిస్థాయిలో ఫలితాలు ఇవ్వలేదు. ఒక చిన్న వ్యాపారి ఆన్‌లైన్ విక్రయాలు ప్రారంభించాలంటే డిజిటల్ నమోదు, పన్ను నిబంధనలు, ఉత్పత్తుల వివరాల అప్‌లోడ్, ఆర్డర్ల నిర్వహణ వంటి ప్రక్రియలను అర్థం చేసుకోవాల్సి ఉంటుం ది. సాంకేతిక పరిజ్ఞానం పరిమితంగా ఉన్న వ్యాపారులకు ఇవి అడ్డంకులుగా మారుతున్నాయి. ప్రయోజనం పొందాల్సిన వర్గాలే వ్యవస్థకు పూర్తిగా అనుసంధానం కాలేకపో తే, ప్రజాస్వామ్యీకరణ లక్ష్యం అసంపూర్ణంగానే మిగిలిపోతుంది.

మరోవైపు వినియోగదారుల విశ్వాసాన్ని పెంచడం కూడా కీలక సవాలుగానే ఉంది. డెలివరీ సమయాలు, ఫిర్యాదుల పరిష్కా రం, చెల్లింపుల సమస్యలు, రిటర్న్ విధానాలు వంటి అంశాల్లో మరింత స్పష్టత, సమర్థత అవసరం. ముఖ్యంగా ప్రాంతీయ భాషల్లో సహాయక సేవలు అందుబాటులో ఉంటే గ్రామీణ, చిన్న చిన్న పట్టణాలకు చెందిన వినియోగదారులు కూడా ఈ వ్యవస్థను సులభంగా ఉపయోగించగలుగుతారు.

ఈ వ్యవస్థను పూర్తిగా వైఫల్యంగా కొట్టిపారేయడం కూడా సరికాదు. డిజిటల్ చెల్లింపుల రంగంలో యూపీఐ మొదటి రోజే దేశవ్యాప్త విజయాన్ని సాధించలేదు. ప్రజల విశ్వాసం, సాంకేతిక మెరుగుదల, నిరంతర ప్రచారం, ప్రభుత్వ ప్రోత్సాహం వంటి అంశాల సమ్మేళనంతో అది నేడు దేశ ఆర్థిక వ్యవస్థలో అంతర్భాగంగా మారింది. ఓఎన్డీసీ కూడా ప్రస్తుతం అలాంటి పరిణామ దశలోనే ఉంది. క్రమంగా మరిన్ని వ్యాపారులు, సేవల ప్రదాతలు, వినియోగదారులు ఇందులో భాగస్వాములవుతున్నా రు. దీర్ఘకాలిక దృష్టితో అవసరమైన మార్పు లు చేస్తే ఇది కూడా ఈ రంగంలో పోటీని పెంచే శక్తిగా ఎదిగే అవకాశం ఉంది.

అవగాహన కార్యక్రమాలతో ఊతం

ఇప్పుడు సాంకేతిక వ్యవస్థ నిర్మాణమే కాదు, ప్రజల విశ్వాసాన్నీ నిర్మించాలి. చిన్న వ్యాపారులకు శిక్షణ, ప్రాంతీయ భాషల్లో సహాయ కేంద్రాలు, విస్తృత ప్రచార కార్యక్రమాలు, స్వయం సహాయక సంఘాలు, గ్రా మీణ ఉత్పత్తిదారులకు ప్రత్యేక ప్రోత్సాహం వంటి చర్యలు వ్యవస్థను బలోపేతం చేస్తా యి. ప్రభుత్వరంగ సంస్థలు, చేనేత సంస్థలు, గ్రామీణ ఉత్పత్తులను మరింత ప్రముఖంగా ప్రదర్శించే విధానాలను కూడా పరిశీలించా ల్సిన అవసరం ఉంది.

మొత్తానికి, డిజిటల్ మార్కెట్‌ను మరింతగా సమాన అవకాశాల వేదికగా మార్చగల సామర్థ్యం ఓఎన్డీసీకి ఉంది. కానీ, ఆశయం ఎంత గొప్పదైనా అది సామాన్యుడికి చేరనంత కాలం దానికి పూర్తి సార్థకత చూకూరదు. సాంకేతికతను ప్రజలకు దగ్గర చేయడం, వినియోగాన్ని సులభ తరం చేయడం, విశ్వాసాన్ని పెంపొందించడం అనే మూడు అంశాలపైనే ఓఎన్డీసీ భవిష్యత్తు ఆధారపడి ఉంది. ఆశయంలోని ‘ఓపెన్’ అనే భావన ఆచరణలోనూ ప్రతిబింబించినప్పుడే ఈ ప్రజాస్వా మ్యీకరణ అనే లక్ష్యం నిజమైన విజయాన్ని అందుకుంటుంది.