calender_icon.png 13 June, 2025 | 2:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శాతవాహన ఆంగ్ల విభాగంలో డిజిటల్ క్లాస్ ప్రారంభం

11-06-2025 12:33:38 AM

కొత్తపల్లి, జూన్ 10:శాతవాహన విశ్వవిద్యాలయంలోని ఆరట్స్ కళాశాలలో ఆంగ్ల విభాగంలో కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య సూరేపల్లి సుజాత డిజిటల్ క్లాసు రూమ్ ప్రారంభోత్సవం చేయడం జరిగింది. తదుపరి మాట్లాడుతూ ‘డిజిటల్ క్లాస్రూమ్‘ అం టే, సాంకేతిక పరికరాలు, సాఫ్ట్వేర్లను ఉపయోగించి అత్యాధునిక విద్యను అందించే తరగతి గదని ఇది సాధారణ తరగతి గది క న్నా భిన్నంగా ఉంటుందని, ఎందుకంటే ఇక్కడ బోధన,

అభ్యాసం డిజిటల్ పద్ధతిలో జరుగుతాయని డిజిటల్ క్లాస్రూమ్లో ఉపాధ్యాయులు స్మార్ట్ బోర్డులు ఉపయోగించి పాఠాలను, వీడియోలను చూపించి విద్యార్థులకు భోదన సౌకర్యవంతంగా చేస్తారన్నా రు. ఈ ప్రారంభోత్సవంలో అధ్యాపకులు డా. ప్రదీప్ రాజ్, హరికృష్ణ, బోధనేతర సి బ్బంది శేఖర్, నాగతేజ, ఆంగ్ల విభాగ మొ దటి మరియు ద్వితీయ సంవత్సర విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.