20 July, 2026 | 5:38 PM

Breaking News

శ్రీ ఉమామహేశ్వరం ఆలయ అభివృద్ధికి దాతల చేయూత   •   మున్సిపాలిటీలోనూ ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలి   •   సింగరేణి డిస్పెన్సరీని పునఃప్రారంభించిన డైరెక్టర్ (పి&పి) కె. వెంకటేశ్వర్లు   •   ముద్దసాని దామోదర్ రెడ్డి చేసిన సేవలు మరువలేనివి   •   మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించిన టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు   •   ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టండి   •   తెలంగాణ రక్షణ సమితిలో చేరిన మండల యువకులు   •   చిన్నకల్వల సింగిల్ విండో చైర్మన్ గా మురళీధర్ రావు బాధ్యతల స్వీకరణ   •   ఎస్‌ఐఆర్ ప్రక్రియ వేగవంతం చేయాలి   •   ఓటు హక్కుపై ప్రజల్లో అవగాహన   •  

సైబరాబాద్‌లో విద్యార్థుల సురక్షిత రవాణాకు డిజిటల్ వేదిక

20-07-2026 12:00 AM

ఎస్‌ఎంపీ ప్రోగ్రామ్‌లో భాగంగా క్యాంపస్ కంప్లయెన్స్ వర్క్‌షాప్ స్టూడెంట్ పోర్టల్ ప్రారంభం

శేరిలింగంపల్లి, జూలై 19 (విజయక్రాంతి): విద్యార్థుల సురక్షిత రవాణా కోసం సైబరాబాద్ పోలీసులు చేపట్టిన స్టూడెంట్ మొబిలిటీ ప్రోగ్రామ్ లో భాగంగా ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీ, గచ్చిబౌలిలో క్యాంపస్ కంప్లయెన్స్ వర్క్‌షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా స్టూడెంట్ పోర్టల్ ను ప్రారంభించారు.అనంతరం సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డా.ఎం. రమేష్ మాట్లాడుతూ, విద్యార్థుల భద్రత అందరి ఉమ్మడి బాధ్యత అని, ఇంటి నుంచి స్కూల్ వరకు మొత్తం ప్రయాణం సురక్షితంగా ఉండాలని అన్నారు.

విద్యాసంస్థలు, తల్లిదండ్రులు, రవాణా నిర్వాహకులు, ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పని చేయాలని సూచించారు.520కి పైగా విద్యాసంస్థల్లో సర్వే, పైలట్ ప్రాజెక్ట్ ఆధారంగా రూపొందిన ఈ ప్రోగ్రామ్ ద్వారా సేఫ్ మొబిలిటీ కారిడార్స్, ట్రాఫిక్ నియంత్రణ,(ఎస్‌ఓపిలు) అమలు, డిజిటల్ సమన్వయం లక్ష్యంగా పని చేస్తారు.సైబరాబాద్ను దేశానికి ఆదర్శవంతమైన స్టూడెంట్ మొబిలిటీ మోడల్గా తీర్చిదిద్దడమే లక్ష్యమని ఆయన తెలిపారు.

ఈ కార్యక్రమంలో జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ట్రాఫిక్) సన్ప్రీత్ సింగ్,డీసీపీ కూకట్పల్లి రితిరాజ్, డీసీపీ ట్రాఫిక్ ఎస్.రవికుమార్, టీజీఎస్‌ఆర్టి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎ. శ్రీధర్, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఆనంద్ శ్యామ్, సంగమిత్ర స్కూల్ కరస్పాండెంట్ అరుంధతి, వివిధ శాఖల అధికారులు,విద్యాసంస్థల ప్రతినిధులు,రవాణా నిర్వాహకులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.