శాంతియుత పోరాటాలతోనే డంపింగ్ యార్డ్ తొలగింపు సాధ్యం
- డంపింగ్ యార్డ్ ఎత్తివేయాలని కోరుతూ మహా పాదయాత్రలు
- బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బానోతు రవీంద్రనాయక్
జవహర్ నగర్, జూలై 19 (విజయక్రాం తి): మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీసర సర్కిల్ జవహర్ నగర్ రాంకీ డంపింగ్ యార్డ్ ఎత్తివేతే లక్ష్యంగా డంపింగ్ యార్డ్ ఎత్తివేత పరిష్కారం కొరకు రాజీలేని ప్రజా పోరాటాల ద్వారానే సాధ్యమని బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బానో తు రవీంద్ర నాయక్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఆదివారం జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ ఎత్తివేత పోరాట కమిటీ ఆధ్వర్యంలో 9వ రోజున పాదయాత్ర నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి బీఎస్పీ నేత బిర్రు ఏక స్వామి అధ్యక్షతన బండ్లగూడ అహ్మద్గూడ టు బిహెచ్కె ఫేస్ 1 పోరాట కమిటీ కన్వీనర్ విజయ్ కుమార్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో చైర్మన్ షేక్షావలి కన్వీనర్ ఉమా మహేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముక్కుపుటాల ను అదరగొట్టే దుర్వాసనలతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు.
ఇప్పటికైనా జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ ను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 26వ తేదీన పర్యావరణ పరిరక్షణ డంపింగ్ యార్డ్ సమస్యపై జరిగే సదస్సును జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో గడ్డం సదానందం, స్వరూప, లక్ష్మీబాయి, శివ బాబు, మల్లేష్, సింగారయ్య గౌడ్, జయసుధ, ఫాతిమా, వేణు, యాదగిరి, పెరక సునీత, చంద్రమౌళి, నిర్మల, వెంకటేష్, సుక్క దయానంద్, అరుణ్ కుమార్, శ్రీహరి, జాఫర్, కొండ అప్పారావు, విజయరామరాజు తదితరులు పాల్గొన్నారు.






