మద్యం సీసాలతో మందుబాబులు పరార్!
10-09-2024 12:07 PM
అమరావతి: ఎన్నికల సమయంలో స్వాధీనం చేసుకున్న మద్యాన్ని పోలీసులు ధ్వంస చేస్తూంటే మందుబాబులు చూస్తూ ఆగలేక పోయారు. ఏకంగా పోలీసుల ఎదుటే మద్యం సీసాలు తీసుకుని పారి పోయారు. ఎన్నికల సమయంలో గుంటూరు జిల్లా వ్యాప్తంగా రూ. 50 లక్షల విలువ చేసే 24 వేల మద్యం సీసాలను ధ్వంసం చేయడం ప్రారంభించారు. ఈ వార్త తెలుసుకున్న మందు బాబులు వెంటనే హుటాహుటిన అక్కడికి చేరుకుని ఎవరికి దొరికిన మద్యం సీసాలను వారు తీసుకుని పరిగెత్తారు. ఒక్క సారిగా గుంపులు గుంపులు గా అక్కడికి చేరుకోవడంతో పోలీసులు వారిని నిలువరించలేకపోయారు. బాటిళ్లను వారిముందే పగుల గొడుతుంటే ఆగలేక పోయామని కొందరు మందుబాబులు పోలీసులతో చెప్పినట్లు తెలిపారు.






