సాగర్ లో గణేష్ నిమజ్జనాలకు అనుమతి లేదంటూ ఫ్లెక్సీలు.. నేడు హైకోర్టులో విచారణ
హైదరాబాద్: నగరం నలుమూలల నుచి ఏటా భారీగా వినాయక విగ్రహాలు నిమజ్జనాలు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ, హైదరాబాద్ పోలీసులు హుసేన్ సాగర్ లో వినాయక విగ్రహాల నిమజ్జనాలకు అనుమతి లేదంటూ ట్యాంక్ బండ్ వైపు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. హైకోర్టు ఆదేశాల మేరకు హుసేన్ సాగర్ లో వినాయక నిమజ్జనాలకు అనుమతి లేదంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ట్యాంక్ బండ్ వైపు పెద్దఎత్తున ఇనుప కంచెలు ఏర్పాటు చేశారు.
ఇదిలా ఉండగా.. హుసేన్ సాగర్ లో వినాయక విగ్రహాల నిమజ్జనాలపై హైకోర్టులో మరోసారి పిటిషన్ దాఖలైంది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, పలు రసాయనాలు కలిపిన రంగులతో తయారు చేసిన వేలాది గణేష్ విగ్రహాలను హుస్సేన్ సాగర్ లో నిమజ్జం చేయడం వల్ల సాగర్ కలుషితం అవుతుందని గతేడాది హైకోర్టు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. అయిన ఈ ఏడాది కూడా కొనసాగించాలని సోమవారం కోర్టులో పిటిషన్ దాఖలైంది. చెరువుల పరిరక్షణ కోసం ఏర్పాటైన హైడ్రా దీనికి బాధ్యత వహించాలని పిటిషనర్ హైడ్రా కమిషనర్ ను ప్రతివాదిగా చేర్పారు. ఈ పిటిషన్ పై ఇవాళ హైకోర్టులో విచరణ జరుగనుంది.






