8 May, 2026 | 9:50 AM

ప్రజాభవన్‌లో 16వ ఆర్థిక సంఘం బృందం సమావేశం

10-09-2024 11:47 AM

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో 16వ ఆర్థిక సంఘం మంగళవారం రెండు రోజులు పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ ప్రజాభవన్ లో 16వ ఆర్థిక సంఘం బృందం సమావేశమైంది. 16వ ఆర్థిక సంఘం ఛైర్మన్ అరవింద్ పనగారియా నేతృత్వంలో ఈ భేటీ జరుగుతుంది.  ఈ సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు కే.కేశవరావు, షబ్బీర్ అలీ, సీఎస్ శాంతి కుమార్ హాజరయ్యారు. కేంద్రం నుంచి రాష్ట్రాలకు రావాల్సిన నిధుల పెంపు విషయంలో ఆర్థిక సంఘాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరేందుకు ప్రణాళికలను సిద్ధం చేసింది. అయితే రాష్ట్రంలో ఉన్న జనాభా ప్రాతిపధికన కాకుండా రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని, వర్షాలు, కరువులు వచ్చినప్పుడు జాతీయ విపత్తుగా గుర్తించి నిధులు కేటాయించాలని ప్రభుత్వం కోరనుంది.