3 August, 2026 | 3:38 AM

డర్టీ గ్యాంగ్‌స్టర్స్..

03-08-2026 01:50 AM

విక్రమ్ సహిదేవ్, సంధ్యా వశిష్ట, తారక్ పొన్నప్ప ప్రధాన పాత్రల్లో భవ్యశ్రీ మూవీ మేకర్స్, నక్కిన నెరేటివ్స్ బ్యానర్లపై కాండ్రేగుల నాయుడు, త్రినాథరావు నక్కిన నిర్మిస్తున్న చిత్రం ‘అనకాపల్లి’. ఈ సినిమాకు ఖగేష్ తమ్మినేని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీకి కథ, స్క్రీన్‌ప్లేను అందించడమే కాకుండా త్రినాథరావు నక్కిన ఓ ముఖ్యపాత్రను కూడా పోషించారు. ఆగస్టు 7న విడుదల కానున్న ఈ సినిమా నుంచి తాజాగా ఓ మాసీ సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.

ఈ పాటను రియల్ హీరో సోనూ సూద్ విడుదల చేశారు. ‘డర్టీ గ్యాంగ్‌స్టర్స్’ అంటూ సాగే ఈ లిరికల్ వీడియోను చూస్తుంటే సినిమా ఎంత రా అండ్ రస్టిక్గా ఉంటుందో అర్థం అవుతోంది. ఈ పాటను కేకే రచించగా.. పృథ్వీ చంద్ర, ఈకే ఆలపించారు. దేవ్ జండ్ బాణీ సమకూర్చారు. ఈ చిత్రానికి డీవోపీ: మాయా వీ; సంగీతం: దేవ్ జండ్; ఎడిటర్: శ్రీకృష్ణ అట్టలూరి; ప్రొడక్షన్ డిజైన్: రఘు కులకర్ణి.