ప్రాణమిత్రుడిని గుర్తుకుతెచ్చే సమ్మర్ హాలిడేస్
ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రూపొందుతున్న బాలల చిత్రం ‘సమ్మర్ హాలిడేస్’. ఈ సినిమాను మన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసే ఒక అందమైన కథతో దర్శకుడు శ్రీకర్ రూపొందిస్తున్నారు. ఇందులో మాస్టర్ రోహన్, మాస్టర్ అరుణ్, బేబి ఖుషి కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
జయసుధ, రాజీవ్ కనకాల, వాసుకి, హర్షిణి, హర్షవర్థన్ ఇతర ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు. త్వరలోనే ‘సమ్మర్ హాలిడేస్‘ సినిమా థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఆదివారం స్నేహితుల దినోత్సవం సందర్భంగా ఈ సినిమా నుంచి మేకర్స్ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో కీ రోల్స్ చేస్తున్న రోహన్ రాయ్, అరుణ్ దేవ్ ఊరి కాలువలో సరదాగా ఆడుకుంటున్న స్టిల్ ఆకట్టుకుంటోంది. వీళ్లిద్దరి పాత్రలు ప్రతి ప్రేక్షకుడు తన ప్రాణ మిత్రుడిని గుర్తుచేసుకునేలా ఉండబోతున్నాయి. ఈ చిత్రానికి డీవోపీ: సాయిప్రకాశ్; సంగీతం: సింజిత్ యెర్రమల్లి.






