calender_icon.png 11 November, 2025 | 2:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వ్యక్తి అదృశ్యం

11-11-2025 01:22:16 AM

జహీరాబాద్ టౌన్, నవంబర్ 10 :జహీరాబాద్ పట్టణంలోని వసుంధర నగర్ కాలనీలో నివాసం ఉంటున్న మైనంపల్లి సోమనాథ్ అలియాస్ పవన్ (26) అదృశ్యమైనట్లు జహీరాబాద్ టౌన్ ఎస్‌ఐ వినయ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 8న ఉదయం ఇంటి నుంచి డ్యూటీ కి వెళ్లి ఇప్పటివరకు తిరిగి రాలేదని ఆయన తెలిపారు. అదృశ్యమైన సోమనాథ్ మ హేంద్ర అండ్ మహేంద్ర కంపెనీలో కాంట్రాక్టు ఉద్యోగం చేస్తున్నాడని తెలిపారు. సోమనాథ్ భార్య మైనేల్లి భవాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ వినయ్ కుమార్ తెలిపారు.