11-11-2025 01:23:39 AM
టీజీఐఐసి చైర్ పర్సన్ నిర్మల జగ్గారెడ్డి
సంగారెడ్డి, నవంబర్ 10 :సంగారెడ్డి, కంది మండలాలలో వానాకాలం వడ్ల కొనుగోలు కేంద్రాలను టిజీఐఐసి చైర్ పర్సన్ నిర్మల జగ్గారెడ్డి సోమవారం ప్రారంభించారు. ప్రతి రైతు వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఉపయోగించుకోవాలని అన్నారు. కష్టపడి పండించిన ధాన్యాన్ని దళారులకు అప్పగించొద్దని, తెలంగాణ ప్రభుత్వం వడ్లకు మద్దతు ధర ఇస్తుందని తెలిపారు. ఏ గ్రేడ్ రూ.2389, సాధారణ రకం గ్రేడ్ రూ.2369, సన్నవడ్లకు రూ.2389, బోనస్ 500, మొత్తం రూ. 2889 గా ఇస్తుందని వివరించారు.
ప్రతి ఒక్క రైతు వడ్ల కొనుగోలు కేంద్రాలను ఉపయోగించుకోవాలని సూచించారు. బోనస్ కు కావలసిన పత్రాలు, కొత్త పాస్ బుక్, బ్యాంక్ అకౌంట్ బుక్, ఆధార్ కార్డ్ ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రాంచందర్ నా యక్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రఘు గౌడ్, ప్రభాకర్ రెడ్డి, తాళ్లపల్లి మాజీ సర్పంచ్ ప్రవీణ్ కు మార్, మాజీ ఉపసర్పంచ్ హషం, లక్ష్మారెడ్డి, ప్రభుత్వ అధికారులు రైతులు పాల్గొన్నారు.