4 March, 2026 | 5:01 PM

పర్హాబాద్ చెంచుపెంటలో పూరి గుడిసె దగ్ధం

04-03-2026 03:32 PM

అచ్చంపేట: నల్లమల్ల అభయారణ్యం పరిధిలోని పర్హాబాద్ చెంచుపెంటలో ప్రమాదవశాత్తు నిప్పంటుకొని పూరిగుడిసె దగ్ధమైంది. వివరాలు ఇలా..  నాగర్క ర్నూలు జిల్లా అమ్రాబాద్ మండల పరిధిలోని పర్హా బాద్ చెంచుపెంటలోనీ  అడవిలో అగ్ని ప్రమాదాలు జరుగ కుండా అటవీశాఖ సిబ్బం ది ఫైడ్లైన్ ఏర్పాటు చేశారు.  పర్హాబాద్ పెంట సమీపంలోని అడవిలో ఎండు గడ్డిని కాల్చుతుండగా గాలికి నిప్పుకణికలు ఎగిరిపడి తోకల పార్వతమ్మకు చెందిన పూరి గుడిసెకు నిప్పు అంటుకొని పూర్తిగా కాలిపోయింది.

ప్రమాదంలో తిండిగింజలు, సౌరశక్తి పలకలు, బ్యాటరీలు.. ఇతర నిత్యవసర సామాగ్రి అగ్నికి ఆహుతయింది. దగ్ధమైన పూరిల్లు అటవీశాఖలో పనిచేసే సెక్షన్ అధికారి తోకల గురువయ్యదని మన్ననూరు ఇన్ఛార్జి రేంజ్ అధికారి గురుప్రసాద్ తెలిపారు. నష్టాన్ని అంచనా వేసి ఆర్థిక సహాయం అందజేయనున్నట్లు ఆయన తెలిపారు.