10 May, 2026 | 12:15 AM

Breaking News

కరీంనగర్ బంద్ ప్రశాంతం   •   దేవునితండాలో గాలివాన భీభత్సం   •   మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా శ్రీరామ్ వెంకటేష్ పునర్నియామకం   •   నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించిన దేవస్థానం   •   రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్ మృతి   •   ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును ఢీకొన్న ఇసుక టిప్పర్   •   సిర్గాపూర్‌లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే   •   రోడ్లపై ధాన్యం వేస్తే కఠిన చర్యలు తప్పవు: డిఎస్పి వెంకట్ రెడ్డి   •   ధాన్యం కొనుగోలు, రైతు నమోదు ప్రక్రియలపై దృష్టి సారించాలి   •   ఘనంగా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ వివాహ వార్షికోత్సవ వేడుకలు   •  

‘భారతమాత మహా హారతి’లో అపశ్రుతి

27-01-2025 12:40 AM
  1. బాణసంచా కాల్చుతుండగా అగ్ని ప్రమాదం
  2. హైదరాబాద్ హుస్సేన్ సాగర్‌లో ఘటన
  3. రెండు బోట్లు దగ్ధం.. నలుగురికి గాయాలు
  4. ఈదుకుంటూ ఒడ్డుకు చేరిన ముగ్గురు సిబ్బంది

హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 26(విజయక్రాంతి): హైదరాబాద్ నెక్లెస్‌రోడ్‌లోని పీపుల్స్ ప్లాజా గ్రౌండ్‌లో భారతమాత ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన “భారతమాతకు మహా హారతి” కార్యక్రమంలో అపశ్రుతి చోటుచేసుకుంది.

ఆదివారం సాయంత్రం జరిగిన ఈ కార్యక్రమంలో గవర్నర్ జిష్ణుదేవ్‌శర్మ, కేంద్ర బొగ్గు, గనుల శాఖల మంత్రి కిషన్‌రెడ్డి ప్రసంగించిన అనంతరం నిర్వాహకులు బాణసంచా కాల్చడానికి తెలంగాణ టూరిజం డెవలప్‌మెంట్‌కు చెందిన రెండు బోట్లలో బాణసంచా సామగ్రిని హుస్సేన్‌సాగర్ మధ్యలోకి తీసుకెళ్లారు.

బాణసంచా పేలుస్తున్న క్రమంలో నిప్పురవ్వలు తిరిగి అదే బోట్లపై పడడంతో..వాటిలో నిల్వ చేసిన బాణసంచా పేలి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది.  రెండు పడవలకు మంటలు అంటుకుని దగ్ధమయ్యాయి. ప్రమాద సమయంలో రెండు బోట్లలో ఏడుగురు సిబ్బంది ఉన్నారు. వారిలో నలుగురికి గాయాలయ్యాయి.

ముగ్గురు ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు. గాయపడిన నలుగురిలో ఇద్దరిని గాంధీ దవాఖానకు, ఇద్దరిని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలంలో డీఆర్‌ఎఫ్, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.