దిశ సమావేశంలో జిల్లా అభివృద్ధిపై సమీక్ష

15-09-2026 | 06:44pm

జనగామ,(విజయక్రాంతి): జిల్లాలో కొనసాగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు(district development), సంక్షేమ పథకాల అమలుపై కలెక్టర్ సందీప్ కుమార్ ఝా(Collector Sandeep Kumar Jha) ఆధ్వర్యంలో కలెక్టరేట్ సమావేశ మందిరంలో దిశ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల పురోగతిపై సమగ్రంగా సమీక్షించారు. ప్రజలకు సంక్షేమ పథకాల(Welfare schemes) ప్రయోజనాలు సమర్థవంతంగా అందేలా చర్యలు తీసుకోవాలని, జిల్లాను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ సమావేశంలో వరంగల్ పార్లమెంటు సభ్యురాలు కడియం కావ్య, స్టేషన్ ఘనపూర్ శాసనసభ్యులు కడియం శ్రీహరి, జనగామ మున్సిపల్ చైర్ పర్సన్ కడకంచి బాలమణి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు