15 July, 2026 | 6:40 AM

రెడ్డిగా ముద్రగడ పద్మనామం!

21-06-2024 01:49 AM

పేరు మార్పుపై ఏపీ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్

హైదరాబాద్, జూన్ 20 (విజయక్రాంతి): వెఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీమంత్రి ముద్రగడ పద్మనాభం పేరు మార్పుపై ఏపీ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. పిఠాపురంలో జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ను ఓడించకపోతే తన పేరు మార్చుకుంటా నని ముద్రగడ సవాల్ విసిరారు. పవన్ గెలిచిన నేపథ్యంలో తనపేరు మార్చుకుంటానని, గెజిట్ దరఖాస్తు పెట్టుకుంటానని తెలిపారు. దరఖాస్తు చేసుకున్నందున ఆయన పేరును ముద్రగడ పద్మనాభరెడ్డిగా మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది.