చిన్న స్టేషన్లపై చిన్నచూపు
ఇబ్బందుల్లో రైలు ప్రయాణికులు
మహబూబాబాద్, మార్చి 12 (విజయక్రాంతి): కాజీపేట నుండి మొదలుకొని డో ర్నకల్ వరకు ఉన్న పలు చిన్న రైల్వే స్టేషన్లలో అభివృద్ధి పనులపై రైల్వే శాఖ అధికారులు చిన్న చూపు చూస్తున్నట్లు ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. కొత్తగా కాజీపేట నుండి విజయవాడ వరకు మూడో రైల్వే లైన్ పను లు ముమ్మరంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో చింతలపల్లి, ఏలుగూరు, ఇంటికన్నె, తాళ్లపూస పల్లి, గుండ్రాతి మడుగు, గార్ల తదితర చిన్న రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల సౌకర్యం కోసం చేపట్టిన అభివృద్ధి పనులు నత్తనడకన సాగుతున్నాయని ఆరోపిస్తున్నారు.
అ లాగే కేసముద్రం, నెక్కొండ రైల్వే స్టేషన్లలో సైతం రెండవ ఫ్లాట్ ఫామ్ పై అభివృద్ధి పనులు అసంపూర్తిగా వదిలేశారని ఆరోపిస్తున్నారు. చిన్న స్టేషన్లలో చేపట్టిన ఫుట్ ఓ వర్ బ్రిడ్జి పనులు, ప్లాట్ఫారం పై సౌకర్యాలు, తాగునీటి వసతి, టాయిలెట్లు, లైట్లు, ప్రయాణికులు వేచి ఉండేందుకు బెంచీలు లేకపోవ డంతో రైళ్లు వచ్చేంతవరకు వేచి ఉండే ప్ర యాణికులు ఇబ్బందులు పడుతున్నారు. చి న్న స్టేషన్లలో ప్రయాణికులకు మౌలిక వసతులు కల్పించకుండా , చేపట్టిన అభివృద్ధి ప నులు జాప్యం చేస్తుండడం వల్ల ప్రయాణికులు అసౌకర్యానికి గురవుతున్నారు.
ఇంటి కన్నె, చింతలపల్లి, ఏలుగూరు రైల్వే స్టేషన్లో ఓవర్ బ్రిడ్జి పనులు అసంపూర్తిగా వదిలేశారని ఆరోపిస్తున్నారు. దీనివల్ల స్టేషన్లో రైలు టికెట్ కొన్న తర్వాత అప్ డౌన్ వైపు వెళ్లే రైళ్ల కోసం రైలు పట్టాలు దాటేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇంటికన్నె రైల్వే స్టేషన్లో రైలు పట్టాలు దాటడం తప్ప మరో మార్గం లేకపోవడంతో ప్రమాదకరంగా మారిందని వాపోతున్నారు.
కాజీపేట టౌన్ పరిస్థితి అదే తీరు
ఇక కాజీపేట టౌన్ రైల్వే స్టేషన్లో సైతం ప్రయాణికులకు మౌలిక వసతులు కల్పించలేదని వాపోతున్నారు. ప్లాట్ ఫామ్ పై ప్ర యాణికులు కూర్చోవడానికి అవసరమైన బెంచీలు లేవని, ప్లాట్ఫ్పా లైట్లు కూడా లేవ ని, మరుగుదొడ్లు, మూత్రశాలలు సరిగా లేవని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్లాట్ ఫామ్ పై పిచ్చి మొక్కలు పెరిగి స్టేషన్ అద్వానంగా మారిందని ఆవేదన వ్య క్తం చేస్తున్నారు. రైల్వే అధికారులు స్పందించి చిన్న స్టేషన్లో చేపట్టిన అభివృద్ధి పనులను పూర్తి చేసి, ప్రయాణికులకు ఇబ్బందులు తొలగించాలని కోరుతున్నారు.




