11 April, 2026 | 3:53 PM

Breaking News

బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మ జ్యోతిబాపూలే   •   ఐలాపూర్‌లో హైడ్రా భారీ ఆపరేషన్.. కూల్చివేతలపై రంగనాథ్ క్లారిటీ!   •   తంగళ్ళపల్లి మండల కేంద్రంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు   •   ఇప్పుడు ఎన్నికలు జరిగినా... కాంగ్రెస్‌కు 100 సీట్లు ఖాయం   •   కలెక్టర్ కార్యాలయంలో పూలే జయంతి వేడుకలు   •   జ్యోతిరావు పూలే జయంతి ఆశయ సాధన కోసం కృషి చేయాలి   •   20న జగిత్యాలలో కేసీఆర్ సభ... జీవన్ రెడ్డి చేరిక — బీఆర్ఎస్ పార్టీకి మరింత బలం   •   లబ్ధిదారులకు కుట్టు మిషన్ల పంపిణీ   •   సారంపల్లిలో శిరీష వివాహానికి కరీంనగర్ డెయిరీ పుస్తెమట్టెలు అందజేత   •   మొక్కజొన్న పంటను ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలోని విక్రయించాలి   •  

జియో సేవల్లో అంతరాయం

18-09-2024 12:00 AM

సోషల్ మీడియాలో వెల్లువెత్తిన ఫిర్యాదులు

ముంబయి: ప్రముఖ టెలికాం సంస్థ జియో సేవల్లో అంతరాయం ఏర్పడింది. జియో మొబైల్ నెట్‌వర్క్‌తో పాటు జియో ఫైబర్ సేవలకూ అంతరాయం ఏర్పడినట్లు తెలుస్తోంది.ఈ విషయాన్ని తెలియజేస్తూ వినియోగదారులు సోషల్‌మీడియా వేదికగా ఫిర్యాదులు చేస్తున్నారు. ముఖ్యంగా ముంబయి వాసులు ఎక్కువగా ఈ సమస్య ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. డౌన్‌డిటెక్టర్ వెబ్‌సైట్ ప్రకారం జియో సేవల్లో అంతరాయంపై 10వేల మందికిపైగా యూజర్లు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.

నో నెట్‌వర్క్, మొబైల్ ఇంటర్నెట్, జియో ఫైబర్ సేవల గురించి ప్రధానంగా ఫిర్యాదులు అందాయి. కాగా జియో సేవల్లో అంతరాయంపై ఆ కంపెనీ స్పందించింది. చిన్నపాటి సాంకేతిక లోపాల కారణంగా ముంబయి వాసులు సేవల్లో అంతరాయం ఎదుర్కొన్నట్లు తెలిపింది. సమస్యలు పరిష్కరించామని, సేవలు యథాతథంగా అందుబాటులోకి వచ్చినట్లు పేర్కొంది. సబ్‌స్ర్కైబర్లకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని విచారం వ్యక్తంచేసింది.