16 July, 2026 | 11:56 AM

కాటేసిన కల్తీ మద్యం

20-06-2024 01:22 AM

తమిళనాడులో 9 మంది మృతి

జిల్లా ఎస్పీ సస్పెండ్.. కలెక్టర్ బదిలీ

చెన్నై, జూన్ 19: తమిళనాడులో మరోసారి కల్తీ మద్యం ప్రజలను కాటేసింది. కల్లుకురిచి, సేలం జిల్లాల్లో బుధవారం కల్తీ మద్యం తాగి 9 మంది మరణించారు. 66 మంది పరిస్థితి విషమంగా ఉన్నది. వీరిలో 17 మందిని మెరుగైన వైద్యం కోసం పుదుచ్చేరిలోని జిప్‌మర్ దవాఖానకు తరలించారు. కల్లుకురిచి జిల్లాలోని కరుణపురం గ్రామంలో కల్లీ మద్యం తాగి ఆరుగురు చనిపోయారు. పొరుగునే ఉన్న సేలం జిల్లాలో ఇద్దరు మరణించారు. వీరంతా మంగళవారం కరుణపురంలోని ఓ మద్యం దుకాణంలో మద్యం కొనుగోలు చేసి సేవించినట్టు గుర్తించారు. అప్పటి నుంచి కండ్లు మసకబారటం, ఊపిరి తీసుకోవటంలో సమస్యలు, తల తిరగటం, డయేరియా లక్షణాలతో బాధపడుతున్నారు. దీంతో వారి కుటుంబసభ్యులు సమీపంలోని దవాఖానలకు తరలించగా చికిత్స పొందుతూ 9 మంది మరణించారు. ఈ ఘటనపై సీఎం స్టాలిన్ సీబీ సీఐడీ విచారణకు ఆదేశించారు. కల్లుకురిచి జిల్లా ఎస్పీని సస్పెండ్ చేశారు. జిల్లా కలెక్టర్‌ను బదిలీ చేశారు.