11 March, 2026 | 8:20 AM

సృష్టికి మూలం స్త్రీ.. వారిని గౌరవించాలి

09-03-2026 12:29 AM

నాగిరెడ్డిపేట్,మార్చి 8 (విజయక్రాంతి): మండలంలోని ధర్మారెడ్డి గ్రామంలో ఉపాధి హామీ సోషల్ ఆడిట్ మూడవ రోజు డోర్ టు డోర్ చేసి గ్రామ సర్పంచ్ గులపల్లి లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో గ్రామసభ ఆదివారం నిర్వహించి అందులో భాగంగా మహిళా దినోత్సవం సందర్భంగా గులాబీ పువ్వులతో సృష్టికి మూలం స్త్రీలు కాబట్టి స్త్రీలను గౌరవించాలి అంటూ ఘనంగా స్త్రీల దినోత్సవం జరుపుకోవడం జరిగిందనీ గ్రామ సర్పంచి గులపల్లి లక్ష్మీనారాయణ తెలిపారు.

99 రోజుల ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మూడవరోజు డంపింగ్ యార్డ్ వద్ద పరిసరాల ప్రాంతాలలో పరిశుభ్రత మరియు తడి పొడి,పొడితడి చెత్తను ఏర్పాటు చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గులపల్లి లక్ష్మీనారాయణ, ఉప సర్పంచ్ జయరాజ్,కన్నారెడ్డి గ్రామ సర్పంచ్ సాయిలు, కార్యదర్శి రమేష్,ఉపాధి హామీ ఈసీ సాయిలు, టెక్నికల్ అసిస్టెంట్ సంగీత, ఫీల్ అసిస్టెంట్ శ్రీనివాస్,సోషల్ ఆడిటర్స్ మనిషా,నికిత పాలకవర్గ సభ్యులు,గ్రామ పెద్దలు పాల్గొన్నారు.