21-01-2026 02:53:50 PM
తంగళ్ళపల్లి,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం రామన్నపల్లె గ్రామంలో పలువురు లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) చెక్కులను కాంగ్రెస్ సీనియర్ నాయకులు మందాటి తిరుపతి యాదవ్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం సహాయ నిధి పేదలకు కొండంత అండగా నిలుస్తోందని అన్నారు. అనారోగ్యంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు సీఎంఆర్ఎఫ్ గొప్ప ఉపశమనం కలిగిస్తోందని పేర్కొన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు నాగరాజు యాదవ్, సురేష్, మేడదుల శ్రీనివాస్, ఆత్మకూరు ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.