calender_icon.png 21 January, 2026 | 4:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సారంపల్లిలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

21-01-2026 02:51:52 PM

తంగళ్ళపల్లి,(విజయక్రాంతి) రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం సారంపల్లి గ్రామంలో పలువురు లబ్ధిదారులకు మొత్తం రూ.2,32,500 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు అందజేశారు. ఈ సందర్భంగా యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు మునిగేల రాజు మాట్లాడుతూ, సీఎం సహాయ నిధి నిరుపేదలకు కొండంత అండగా నిలుస్తోందని పేర్కొన్నారు. ప్రజారోగ్య పరిరక్షణే కాంగ్రెస్ ప్రభుత్వ తొలి ప్రాధాన్యమని, అనారోగ్యంతో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అండగా ఉంటోందని తెలిపారు. కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు, గ్రామ నాయకులు పాల్గొన్నారు.