సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు పంపిణీ
14-05-2026 01:29 AM
సూర్యాపేట, మే 13 (విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో మాజీమంత్రి, స్థానిక ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను బుధవారం పంపిణి చేశారు. ఈ సందర్బంగా ఇటీవల నియోజకవర్గం వ్యాప్తంగా పలు రకాల ప్రమాదాలు, అనారోగ్యంతో వైద్య సేవలు పొందిన 75 మంది లబ్ధిదారులకు అయన సంబంధిత చెక్కులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పలు గ్రామాలకు చెందిన లబ్ధిదారులు పాల్గొన్నారు.






