14 May, 2026 | 2:46 AM

మట్టి పరీక్ష ఆధారంగా ఎరువులను వినియోగించుకోవాలి

14-05-2026 01:31 AM

కేవీకే గడ్డిపల్లి శాస్త్రవేత్త కిరణ్ 

జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి), మే13: రైతులు తమ భూముల ఉత్పాదకతను పెంచుకోవాలంటే మట్టి పరీక్ష ఆధారంగా ఎరువులను వినియోగించుకోవాలని కేవీకే గడ్డిపల్లి శాస్త్రవేత్త ఏ కిరణ్ అన్నారు.బుధవారం మండలంలోని రామన్నగూడెం గ్రామంలో సమగ్ర ఎరువుల వినియోగంపై రైతులకు అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా భూసార పరీక్ష కోసం మట్టి నమూనాలను సేకరించే విధానాన్ని తెలిపారు. అలాగే సమగ్ర ఎరువుల వినియోగంలో భాగంగా పచ్చి ఎరువుల వాడకం వల్ల కలిగే లాభాలను వివరించారు.పచ్చి ఎరువుల వల్ల భూమి సారవంతం పెరగడం,నేల నిర్మాణం మెరుగుపడటం, రసాయన ఎరువుల వినియోగం తగ్గడం వంటి ప్రయోజనాలు ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి గణేష్,ఏఈఓ శోభారాణి, రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు.