8 April, 2026 | 4:59 PM

నిజాంసాగర్‌లో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

08-04-2026 03:03 PM

నిజాంసాగర్,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలో ముఖ్యమంత్రి సహాయ నిధి (Chief Minister Relief Fund) లబ్ధిదారులకు చెక్కుల ను డిసిసి అధ్యక్షులు మల్లికార్జున్ బుధవారం నాడు అందించారు.మండలంలోని గోర్గల్ గ్రామానికి చెందిన కాషా గౌడ్, మంగ్లూర్ గ్రామానికి చెందిన నంగి భూమవ్వకు అందించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ, ఆపదలో ఉన్న ప్రజలకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని, సీఎంఆర్ఎఫ్ ద్వారా అందించే ఆర్థిక సహాయం ఎంతో ఉపయోగకరమని తెలిపారు. ప్రజలు ఇలాంటి ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుని తమ సమస్యలను అధిగమించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండలానికి చెందిన సర్పంచులు, ఉపసర్పంచులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.