1 August, 2026 | 4:12 PM

Breaking News

శ్రీరామసాగర్ ప్రాజెక్టును పరిశీలించిన మంత్రులు

01-08-2026 03:35 PM

మూడు బ్యారేజీల పునరుద్ధణకు కట్టుబడి ఉన్నాం

మేడిగడ్డ, సుందిళ్లపై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం

హైదరాబాద్: నిజామాబాద్ జిల్లాలో(Nizamabad District) మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy), దుద్దిళ్ళ శ్రీధర్ బాబు ,గడ్డం వివేక్ వెంకటస్వామి శనివారం పర్యటించారు. శ్రీరామసాగర్ ప్రాజెక్టును(Sri Ram Sagar Project) మంత్రుల బృందం పరిశీలించింది. ప్రాజెక్టులోకి ప్రవాహం వివరాలను మంత్రులు అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ... గోదావరిపై ఉన్న ప్రాజెక్టుల పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. ఎస్ఆర్ఎస్ పీ ప్రాజెక్టు(SRSP Project) పూడికతీతపై కార్యాచరణ చేస్తున్నామన్నారు. రెండు రోజుల్లో నీటి విడుదలపై స్పష్టమైన ప్రకటన చేస్తామని వివరించారు. మేడిగడ్డ, సుందిళ్ల నింపట్లేదని బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేసిందని ఉత్తమ్ ఆరోపించారు. మూడు బ్యారేజీల పునరుద్ధరణకు కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు. 60 ఏళ్లయినా కాంగ్రెస్ నిర్మించిన డ్యాములు చెక్కు చెదరలేదని చెప్పారు. బీఆర్ఎస్ కట్టిన మూడు ప్రాజెక్టులు మూడేళ్లకే కూలిపోయాయని మంత్రి ఉత్తమ్ ఎద్దేవా చేశారు.