అంగన్వాడీ, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల పరిశీలన
ఆసిఫాబాద్,(విజయక్రాంతి): రెబ్బెన మండలం గోలేటి గ్రామపంచాయతీ పరిధిలోని ఎన్టీఆర్ నగర్‌లో నిర్మాణంలో ఉన్న నూతన అంగన్వాడీ భవనం, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క శనివారం పరిశీలించారు. పనులు నాణ్యతా ప్రమాణాలతో త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు సూచించారు.అనంతరం కాలనీవాసులతో మాట్లాడి తాగునీరు, రహదారులు, విద్యుత్, డ్రైనేజీ తదితర సమస్యలను తెలుసుకున్నారు. వాటి పరిష్కారానికి అధికారుల దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకునేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కేసరి కిషన్ గౌడ్, మాజీ ప్రజాప్రతినిధులు దుర్గం రవీందర్, మద్దెల సురేందర్ రాజు, ఎర్రం తిరుపతి, లింగంపల్లి ప్రభాకర్, పస్తం రాజు, ఓరగంటి రమేష్, పర్వది సాయి శంకర్, సుజన్ గౌడ్, సురేష్, శ్రీనివాస్, విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు.






