బాధితులకు ‘ముఖ్యమంత్రి సహాయనిధి’ అండ
51 మంది లబ్ధిదారులకు 16.16 లక్షల సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ
ఖమ్మం, జూన్ 4 (విజయక్రాంతి): వైద్య ఖర్చుల నిమిత్తం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్‌ఎఫ్) కొండంత అండగా నిలుస్తోందని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి క్యాంపు కార్యాలయ ఇన్చార్జి తుంబూరు దయాకర్ రెడ్డి పేర్కొన్నారు.
ఖమ్మం శ్రీనగర్ కాలనీలోని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి క్యాంపు కార్యాలయంలో గురువారం సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. మొత్తం 51 మంది లబ్ధిదారులకు రూ. 16,16,500 విలువైన చెక్కులను దయాకర్ రెడ్డి చేతుల మీదుగా అందజేశారు.
లబ్ధిదారుల్లో ఖమ్మం రూరల్ మండలానికి చెందిన వారు 30 మంది, ఏదులాపురం మున్సిపాలిటీకి చెందిన వారు 21 మంది ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిరుపేదలకు మెరుగైన వైద్యం అందించడమే కాకుండా, సీఎంఆర్‌ఎఫ్ ద్వారా ప్రభుత్వం తక్షణ ఆర్థిక సాయం అందిస్తూ భరోసా కల్పిస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మద్దినేని బేబీ స్వర్ణకుమారి, ఆయా ప్రాంతాల కాంగ్రెస్ పార్టీ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.






