5 June, 2026 | 2:15 AM

పెండింగ్ ప్యాచ్ వర్క్ పనులను పూర్తి చేయాలి

05-06-2026 12:58 AM
  1. హెచ్‌ఎం డబ్ల్యూ ఎస్‌అండ్ ఎస్‌బీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ను కోరిన 
  2. గాంధీనగర్ మాజీ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్

ముషీరాబాద్, జూన్ 4(విజయక్రాంతి): పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని గాంధీనగర్ మాజీ కార్పొరేటర్ ఎ. పావని వినయ్ కుమార్ అధికారులను కోరారు. గాంధీనగర్ అరుంధతి నగర్ బస్తీలో కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి  సహకారంతో రూ. 55 లక్షలతో  నిధులతో గతంలో నూతన సివరేజి పైప్ లైన్ పనులను ప్రారంభించి పూర్తి చేసుకున్న అనంతరం పెండింగ్ లో వున్న ప్యాచ్ వర్క్ పనులను  వెంటనే పూర్తి చేయాలని గాంధీనగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ ఎ. పావని వినయ్ కుమార్ గురువారం ఖైరతాబాద్ జలమండలి కార్యాలయంలో హెచ్‌ఎండబ్ల్యూఎస్ అండ్ ఎస్ బి  ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సామ్రాట్ అశోక్ ను డైరెక్టర్ ఎన్. ప్రభును కలిసి కోరారు.

పైప్ లైన్ పనులు పూర్తి అయిన చోట ప్యాచ్ వర్క్ పనులు చేయని కారణంగా బస్తిలోని వృద్ధులు, పిల్లలు నడవలేని పరిస్థితి ఏర్పడిందని మాజీ కార్పొరేటర్  వివరించారు. సానుకూలంగా  స్పందించిన ఉన్నత అధికారులు వారం రోజుల్లో పనులను ప్రారంభించి త్వరగతినా పూర్తి చేస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. మాజీ కార్పొరేటర్ తో పాటు బీజేపీ సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్  ఎ. వినయ్ కుమార్,  బీజేపీ నాయకులు ఎం. ఉమేష్, ఆనంద్ రావు ఉన్నారు.