ప్రజల చేతిలో శక్తివంతమైన ఆయుధం.. సమాచార హక్కు చట్టం..
- సమాచార హక్కు చట్టం సాధన కమిటీ
- జాతీయ చైర్మన్ చంటి ముదిరాజ్
ముషీరాబాద్, జూన్ 4 (విజయక్రాంతి): సమాచార హక్కు చట్టం ప్రజల చేతిలో శక్తివంతమైన ఆయుధం అని సమాచార హక్కు చట్టం సాధన కమిటీ జాతీయ చైర్మన్ డాక్టర్ చంటి ముదిరాజ్ అన్నారు. కమిటీ జాతీయ సహాయ కార్యదర్శిగా అన్నవరం సందీప్ రెడ్డి నియామకాన్ని పురస్కరించుకుని గురువారం బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో సమావేశం నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షురాలు సూర స్రవంతి తోకలసి చంటి ముదిరాజ్ మాట్లాడారు.
సమాచార హక్కు చట్టం-2005 ప్రజలకు పారదర్శక పాలనను అందించే శక్తివంతమైన సాధనమని, ప్రతి పౌరుడు దీనిని వినియోగించి తన హక్కులను సాధించుకోవాలని పిలుపునిచ్చారు. అవినీతి, అక్రమాలు, ప్రజాధన దుర్వినియోగాన్ని వెలికితీయడంలో ఆర్టీఐ కీలకమని తెలిపారు. సూర స్రవంతి మాట్లాడుతూ యువత, సామాజిక కార్యకర్తలు ఆర్టీఐపై ప్రజల్లో అవగాహన పెంచాలని కోరారు. కమిటీ ప్రతినిధులు రాఘవేందర్, ప్రకాష్ పటేల్, అజయ్ కుమార్, కార్తీక్ రెడ్డి, నవీన్ కుమార్, శ్రీకాంత్ రెడ్డి, అశోక్ కుమార్, అరవింద స్వామి, శివ కుమార్, బాపయ్య, మారుతి స్వామి, విష్ణు, మల్లేష్, ప్రవీణ్, దీపక్ కులకర్ణి, సంపత్, సుధీర్ రెడ్డి, మహేందర్ పాల్గొన్నారు.






