4 July, 2026 | 7:43 AM

నిబంధనలకు విరుద్ధంగా ‘డబుల్’ ఇళ్ల పంపిణీ

12-06-2024 12:03 AM

 సర్వే చేయాలని మంత్రి కొండా సురేఖకు కాంగ్రెస్ నాయకుల వినతి

గజ్వేల్, జూన్ 11: గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో నిబంధనలకు విరుద్ధంగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు పంపిణీ చేశారని, సర్వే చేయాలని కోరుతూ మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు మంత్రి, ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్‌చార్జ్ కొండా సురేఖను మంగళవారం హైదరాబాద్‌లోని ఆమె నివాసంలో కలిసి వినతిపత్రం అందజేశారు. ఇళ్ల పంపిణీలో అవకతవకలు జరిగాయని మంత్రికి వివరించారు. సర్వే నిర్వహించి అర్హులకే డబుల్ బెడ్‌రూం ఇళ్లను పంపిణీ చేయాలని కోరారు. మంత్రి ని కలిసిన వారిలో గజ్వేల్ మున్సిపల్ మాజీ చైర్మన్ భాస్కర్, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఎల్లయ్య తదితరులు ఉన్నారు.