18 July, 2026 | 12:17 AM

విద్యార్థులకు విద్యా సామగ్రి పంపిణీ

18-07-2026 12:17 AM

నాగలిగిద్ద, జూలై 17: నాగలిగిద్ద మండలంలోని విఠల్ నాయక్ తండా ఎంపీపీఎస్ పాఠశాలలో ఎన్టీటీ డాటా, యూత్ ఫర్ సేవా సంస్థల ఆధ్వర్యంలో విద్యార్థులకు స్కూల్ బ్యాగులు, నోట్ పుస్తకాలు, జ్యామెట్రీ బాక్సులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్టీటీ డాటా సాఫ్ట్వేర్ సంస్థ డైరెక్టర్ తిమ్మరాజు ప్రసాద్, గీతా గోసంగి పాల్గొని విద్యార్థులకు విద్యా సామగ్రిని అందజేశారు. పాఠశాల అభివృద్ధికి సహకరిస్తున్న దాతలను గ్రామస్థులు, ఉపాధ్యాయులు అభి నందించారు. కార్యక్రమంలో గుండె రావు పాటిల్, ఇమ్రేజ్, సర్పంచ్ జాదవ్ రాజు, ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.