7 August, 2026 | 7:25 PM

నిరుపేదలకు నిత్యావసర సరుకుల పంపిణీ

07-08-2026 06:32 PM

గణపురం,(విజయక్రాంతి): మండలంలోని గాంధీనగర్ గ్రామంలో లక్ష్మి అమ్మ సేవా సంస్థతో పాటు హెల్ప్ టు నిడి, ఆధ్వర్యంలో స్థానిక యువకులు కలిసి ఏర్పరచిన స్వచ్చంద సేవా సంఘం ఆధ్వర్యంలో నిరుపేదలకు నిత్యావసర సరుకులు శుక్రవారం పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా విద్యుత్ సంస్థ భద్రతా విభాగ అధికారి ఊర్మిళ జన్మదినం సందర్భంగా గ్రామానికి చెందిన ఒంటరి మహిళ జయసుధకు సుమారు ఐదు వేల రూపాయల విలువైన రేషన్ కిట్ అందజేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ డా. ఇంజపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తూ మరింత మందికి సహాయం చేయాలని ఆకాంక్షించారు.