ఎస్విఆర్ యునైటెడ్ పాఠశాలల్లో బోనాల ఉత్సవాలు
07-08-2026 07:16 PM
మునిపల్లి,(విజయక్రాంతి): ఆషాడ మాసాన్ని పురస్కరించుకొని శుక్రవారం మండల పరిధిలోని బుదేరా లో గల ఎస్విఆర్, తాటిపల్లి లో గల యునైటెడ్ పాఠశాలల్లో బోనాల ఉత్సవాలను విద్యార్థులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ తెలంగాణ సాంస్కృతిక సాంప్రదాయాలు ప్రతిబింబించేలా విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ తాటిపల్లి మల్లేశం, డైరెక్టర్ శివ శంకర్ ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.






