విద్యార్థులకు పరీక్ష సామగ్రి పంపిణీ
నిజాంసాగర్, మార్చి 9 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా నిజాంసాగర్, మహమ్మద్ నగర్ ఉమ్మడి మండలాలలో పదవతరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరుకాబోతున్న విద్యార్థులకు ఉత్సాహం కలిగించే విధంగా మన కోసం మనం స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు పట్లోళ్ల కిషోర్ కుమార్ ఆధ్వర్యంలో 400 మంది విద్యార్థులకు ప్యాడ్స్, పెన్స్ పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర పి ఆర్ టి యు అధ్యక్షులు పులగం దామోదర్ రెడ్డి మాట్లాడుతూ, మన కోసం మనం అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించి సమాజానికి ఉపయోగపడే అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న పట్లోళ్ల కిషోర్ కుమార్ ఎంతో గొప్ప మనసు ఉన్న గొప్ప వ్యక్తి అని ప్రశంసించారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం చాలా అభినందనీయమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు పరీక్షల ముందు అవసరమైన సామగ్రి అందించడంతో పాటు వారికి ప్రోత్సాహం అందించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా పి ఆర్ టి యు అధ్యక్షులు కుషాల్, నిజాంసాగర్ మండల విద్యాధికారి తిరుపతిరెడ్డి, అచ్చంపేట కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు వెంకటరామిరెడ్డి,నిజాం సాగర్ మండల పి ఆర్ టి యు అధ్యక్షులు సంతోష్ కుమార్, మండల ప్రధాన కార్యదర్శి సురేందర్, రాష్ట్ర అసోసియేషన్ అధ్యక్షులు భాస్కర్ గౌడ్, కలకొండ నారాయణ, మహమ్మద్ నగర్ మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వెంకట్రాంరెడ్డి, పండరి తదితరులు పాల్గొన్నారు.




