29 June, 2026 | 10:04 PM

Breaking News

కార్మిక సమస్యలు పరిష్కరించకుంటే సమ్మె తప్పదు: కె. సారయ్య   •   జర్నలిస్టుల ముందస్తు అరెస్టులు ఖండనీయం : కొర్ర శ్రీను నాయక్   •   హనుమంతులపాడులో ఘనంగా గంగమ్మ తల్లి బోనాల ఉత్సవాలు   •   ఏరువాక పౌర్ణమి సందర్భంగా శ్రీ గురు పీఠంలో ప్రత్యేక పూజలు   •   ప్రజలకు తాగునీటి ఎద్దడి లేకుండా ట్యాంకుల నిర్మాణం   •   నకిలీ విత్తనాలు, పురుగుమందులను అరికట్టాలి   •   బోడుప్పల్–చెంగిచెర్ల రహదారి విస్తరణ పనులు వేగవంతం చేయాలి   •   ప్రతి గ్రామ సంఘంలో మూడు రకాల సంఘాలు చేయాలి   •   జర్నలిస్టులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుంది   •   మత మార్పిడి ప్రయత్నాలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి   •  

ఓయూలో మహిళా దినోత్సవం

10-03-2026 01:27 AM

హైదరాబాద్, మార్చి 9 (విజయక్రాంతి): ఆంధ్ర మహిళా సభ స్కూల్ ఆఫ్ ఇన్ఫర్మాటిక్స్, దుర్గాబాయి విద్యా ప్రాంగణం, ఉస్మా నియా యూనివర్సిటీ ప్రాంగణంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ముఖ్య అతిథిగా పద్మశ్రీ డా. ఎ.హరి హాజరుకాగా కళాశాల ప్రిన్సిపల్ డా.పి.వేణు ప్రియా స్వాగతం పలికారు. విద్యార్థినులు సామాజిక, పారిశ్రామిక, అం తరిక్ష, క్రీడా రంగాలలో స్ఫూర్తిదాయకంగా నిలిచిన మహిళల గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ ద్వారా తమ అభిప్రాయాలను పంచుకున్నారు.

డా హరి మాట్లాడుతూ.. సమాజంలో ఎన్నో అడ్డంకులు, భేదభావా లు ఎదురైనా దృఢమైన సంకల్పంతో ముం దుకు సాగిన మహిళలే ఈరోజు ప్రపంచానికి ఆదర్శంగా నిలిచారని అన్నారు. విద్యార్థి నులు తమ హక్కులు, అవకాశాలను సద్వినియోగం చేసుకుని భవిష్యత్తును నిర్మించే స్ఫూర్తివంతమైన సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కళా శాల చైర్మన్ డా.సి.వి. రామమోహన్ మా ట్లాడుతూ.. మహిళలు ధైర్యం, పట్టుదలతో ముందుకు సాగితే సమాజంలో ఉన్నత స్థా నాలను అధిరోహించగలరని తెలిపారు.

కళాశాల చైర్ పర్సన్ డా. ఎస్. శ్రీదేవి మాట్లాడు తూ.. ప్రతి మహిళ భారత రాజ్యాంగం అం దించిన హక్కులు, చట్టాల గురించి అవగాహన కలిగి ఉండటం ఎంతో అవసరమని పేర్కొన్నారు. మహిళా సాధికారతకు విద్య అత్యంత ముఖ్యమని కళాశాల కార్యదర్శి శ్రీ జె. ఎస్. సుధాకరుడు అన్నారు. కళాశాల వి ద్యార్థినులు ఇన్నోవేటివ్ ఆలోచనలతో ముందుకు వస్తే ప్రథమ (రూ.30 వేలు), ద్వితీయ (20 వేలు), తృతీయ (10 వేలు) శ్రేణులుగా నగదు బహుమతులను అందజేయడానికి సిద్ధంగా ఉన్నానని ఆకెళ్ల గౌరీ శంకర్ తెలిపారు.