కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఉద్యోగులకు చికిత్స
బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పదేళ్లు అడిగినా పట్టించుకోలేదు
ఉద్యోగులకు హెల్త్‌కార్డుల పంపిణీ
అందుబాటులోకి ఉద్యోగుల హెల్త్‌స్కీమ్ పోర్టల్.
ఉద్యోగులకు హెల్త్ కార్డులు అందించిన డిప్యూటీ సీఎం
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో నూతన అధ్యయనం మొదలైందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క(Deputy Chief Minister Bhatti Vikramarka) పేర్కొన్నారు. వైద్య ఖర్చులను భరించలేని స్థితిలో ఉన్నామని ఉద్యోగులు అన్నారని తెలిపారు. సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయటంలో ఉద్యోగులు ఎంతో కీలకమని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఉద్యోగులు సమస్యలతో బాధపడితే ప్రజల సమస్యలు పరిష్కారం కావని సూచించారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడానికి సమన్వయంతో పనిచేశామని తెలిపారు.
ఈహెచ్ఎస్ తో 8 లక్షల ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రయోజనం చేకూరుతోందన్నారు. 9.5 లక్షల మంది ఉద్యోగుల కుటుంబ సభ్యులతో ప్రయోజనం అన్నారు. నగదు రహిత చికిత్స విషయంలో ఉద్యోగులు ఇకపై ధైర్యంగా ఉండొచ్చని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాజీశ్ ఆరోగ్యశ్రీ పరిమితిని రూ. 10 లక్షలకు పెంచిందని వెల్లడించారు. రాష్ట్రంలో 1.06 కోట్ల మందికి ఆరోగ్య శ్రీ కింద కార్పొరేట్ వైద్యం అందిస్తున్నామని చెప్పారు. నగదు రహిత చికిత్స పథకాన్ని ఉద్యోగులు ఎన్నో ఏళ్లుగా అడుగుతున్నారని గుర్తుచేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పదేళ్లపాటు అడిగినా..పట్టించుకోలేదని ఆరోపించారు. ఉద్యోగుల మెడికల్ బిల్లులనూ బీఆర్ఎస్ ప్రభుత్వం పెండింగ్ పెట్టిందని మండిపడ్డారు. ప్రజా ప్రభుత్వం రూ. 10 వేల కోట్ల పెండింగ్ బిల్లులు క్లియర్ చేసిందని సూచించారు.






