17 July, 2026 | 3:30 PM

Breaking News

భారీ వర్షంలోనూ కొనసాగిన కేటీపీపీ ఉద్యోగుల నిరసన

17-07-2026 03:30 PM

టెండర్ల ప్రక్రియ నిలిపివేయాలని డిమాండ్

గణపురం,(విజయక్రాంతి): వైటీపీఎస్  ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 22 వ రోజు కేటీపీపీలో భారీ వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు.యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రంలో బొగ్గు నిర్వహణ విభాగాల ప్రైవేటీకరణను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గత 22 రోజులుగా శాంతియుతంగా కాకతీయ థర్మల్ విద్యుత్ కేంద్రం ఉద్యోగులు ఆందోళన నిర్వహిస్తున్నారు.  టీజీపీఈజేఏసీ ఆధ్వర్యంలో  ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలతో ప్రధాన ద్వారం వద్ద నిరసన చేపట్టారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ... ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించే చర్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తెలిపా రు.  ప్రభుత్వం వెంటనే ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరిం చుకుని, ప్రభుత్వ రంగ సంస్థలను పరిరక్షించడంతో పాటు ఉద్యోగుల హక్కులను కాపాడాలని డిమాండ్ చేశారు. లేనియెడల ఉద్యమాన్ని రాష్ట్రవ్యాప్తంగా మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రాబోయే రోజుల్లో అన్ని సంఘాల ఆధ్వర్యంలో మరిన్ని కార్యక్రమాలు చేస్తామని అన్నారు.