చర్చనీయాంశంగా మారిన బీజేపీ నేతల కామెంట్స్
నిజామాబాద్: ఇందూర్ రణభేరి బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. కాంగ్రెస్ నేతలకు చెందిన షో రూమ్ లలోని స్కూటీలు ఎత్తుకెళ్లాలని బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి సూచించారు. విద్యార్థినులకు స్కూటీలు ఇస్తామన్న కాంగ్రెస్ హామీ మేరకు షో రూమ్ లలో స్కూటీలు ఎత్తుకెళ్లాలని బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ వ్యాఖ్యానించారు. రాకేష్ రెడ్డి వ్యాఖ్యలను బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ సమర్థించారు. నిజామాబాద్ కాంగ్రెస్ అధ్యక్షుడికి స్కూటీల షోరూమ్ ఉందని అరవింద్ వెల్లడించారు. స్కూటీలు ఎత్తుకెళ్లడాన్ని నిజామాబాద్ నుంచే మొదలు పెట్టాలని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో కొడంగల్ బీజేపీ అభ్యర్థిపై రాకేష్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కాటిపల్లి వెంకటరమణారెడ్డి కొడంగల్ లో పోటీ చేస్తారి రాకేశ్ రెడ్డి వెల్లడించారు. కొడంగల్ లో ఈ సారి బీజేపీనే గెలుస్తోందని జోస్యం చెప్పారు.






