17 April, 2026 | 3:29 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

బస్వపూర్‌లో ఇందిరమ్మ చీరల పంపిణీ

23-11-2025 12:57 PM

తంగళ్ళపల్లి,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం బస్వపూర్ గ్రామంలో మహిళలకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల అభివృద్ధికే ప్రాముఖ్యత ఇస్తోందని కాంగ్రెస్ పార్టీ జిల్లా సెక్రటరీ సత్తు శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. మహిళలు ప్రతి రంగంలో ముందుకు సాగేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలోని అర్హులైన మహిళలకు రంగురంగుల, నాణ్యమైన ఇందిరమ్మ చీరలను నాయకులు అందజేశారు.

రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం, ఇందిరమ్మ ఇండ్లను మహిళల పేరిట మంజూరు చేయడం మహిళా సాధికారతకు నిదర్శనమని నాయకులు వెల్లడించారు. చీరల రంగులు, నాణ్యత చూసి మహిళలు ఆనందం వ్యక్తం చేశారు.అర్హులైన ప్రతి మహిళకు ఇందిరా మహిళా శక్తి చీరలు చేరేలా చర్యలు తీసుకుంటామని నాయకులు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మహిళలు సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.