23-11-2025 12:54:20 PM
తంగళ్ళపల్లి,(విజయక్రాంతి): మండపల్లి గ్రామంలో జరిగిన ఇందిరమ్మ చీర పంపిణీ కార్యక్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల అభివృద్ధికే అత్యధిక ప్రాముఖ్యత ఇస్తోందని నాయకులు పేర్కొన్నారు. చెన్నమనేని ప్రశాంత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో గ్రామ అధ్యక్షుడు మహిపాల్ రెడ్డి, మండల మహిళా సంఘం అధ్యక్షురాలు హారిక రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇందులో పాల్గొన్నారు. ప్రభుత్వం చేపడుతున్న వివిధ సంక్షేమ పథకాలు మహిళలను సామాజిక–ఆర్థిక రంగాల్లో మరింత బలపరుస్తున్నాయని నాయకులు తెలిపారు.
గ్రామంలోని అర్హులైన మహిళలకు చీరలను అందజేయడంతో స్థానిక మహిళలు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గ్రామంలోని అర్హులైన మహిళలకు రంగురంగుల, నాణ్యమైన ఇందిరమ్మ చీరలను నాయకులు అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం, ఇందిరమ్మ ఇండ్లను మహిళల పేరిట మంజూరు చేయడం మహిళా సాధికారతకు నిదర్శనమని నాయకులు వెల్లడించారు. చీరల రంగులు, నాణ్యత చూసి మహిళలు ఆనందం వ్యక్తం చేశారు.