calender_icon.png 29 October, 2025 | 11:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కల్యాణలక్ష్మిచెక్కుల పంపిణీ

28-10-2025 12:00:00 AM

 యాచారం అక్టోబర్ 27 : సోమవారం  ప్రజాభవన్ లో యాచారం మండలంలో ని వివిధ గ్రామాలకు చెందిన 69 మంది లబ్ధిదారులకు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి అధికారులతో కలిసి  కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్, చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కల్యాణలక్ష్మి, షాదీముబారక్, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులతో నిరుపేదలను ఆదుకుంటామని అన్నారు.నియోజకవర్గంలో ఎవరు కూడా అధైర్య పడకూడదని అన్నారు.

ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే వరకు  కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో యాచారం తాసిల్దార్ అయ్యప్ప ,ఎంపీడీవో రాధారాణి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మస్కునరసింహ రంగారెడ్డి జిల్లా అధికార ప్రతినిధి వరికుప్పల సుధాకర్, బీసీ సెల్ అధ్యక్షుడు వరికుప్పల తిరుమలేష్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు లిక్కి రాజారెడ్డి, గుండ్రంపల్లి మురళి, దొంతమోని శ్రీకాంత్ గౌడ్ పాల్గొన్నారు.