22-02-2026 06:54:33 PM
ఆ ‘పూర్వ’ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
వరంగల్,(విజయక్రాంతి): 30 సంవత్సరాల క్రితం పదవ తరగతి వరకు కలిసి చదువుకున్న ఆ పూర్వ విద్యార్థులంతా ఆదివారం ఒక్కచోట కలుసుకున్నారు. పదో తరగతి పూర్తి చేసిన తర్వాత విడిపోయిన క్లాస్మేట్స్ తిరిగి కలుసుకున్న సందర్భంగా భావోద్వేగానికి గురయ్యారు. వరంగల్ గ్రేటర్ మున్సిపాలిటీ పరిధిలోని గీసుగొండ మండలం మొగిలిచర్ల జిల్లా పరిషత్ పాఠశాలలో 1994 95 పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఆనాడు విద్య బోధన చేసిన ఉపాధ్యాయులు తిరుపతయ్య, పద్మావతి, లక్ష్మీనారాయణ, బలరాం రెడ్డిని ఘనంగా సన్మానించారు. అనంతరం నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనం లో చిన్ననాటి మధుర స్మృతులు నెమరు వేసుకున్నారు. 30 సంవత్సరాల తర్వాత తామస్థిరపడ్డ ఉద్యోగ ఉపాధి అవకాశాల వివరాలను, కుటుంబ నేపద్యాన్ని పరస్పరం పంచుకున్నారు. తాము ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో ఏ ఏ హోదాలలో ఏం చేస్తున్నారో పరిచయ కార్యక్రమాన్ని నిర్వహించారు.
భవిష్యత్తులో కూడా ఇదే విధంగా పూర్వ విద్యార్థుల స్నేహభావాన్ని కొనసాగించాలని, ఆపద సమయంలో పరస్పరం సహకరించుకోవాలని తీర్మానించారు. ఈ కార్యక్రమానికి మొగిలిచర్ల, రెడ్డిపాలెం, అక్కంపేట, ముత్యాలపల్లి, కొత్తపేట, ఆగ్రంపాడు, నాగయ్య పల్లె గ్రామాల నుండి పూర్వ విద్యార్థులు గజ్జి రాజు, ఆడెపు శ్రీధర్, ములుక రాజు, చిలివేరు రాజు, గొల్లపెల్లి రఘు మెరుగు అశోక్, వీరేందర్, పోగుల యుగేందర్, వేణు సునీత భవాని, రజిత, రాణి, చింతం రవికుమార్, గుండాల రాజు, కరుణాకర్, సాంబయ్య, పాల్గొన్నారు.