calender_icon.png 29 October, 2025 | 2:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోలీసు విధులపై ప్రత్యక్ష అవగాహన

28-10-2025 12:00:00 AM

  1. విద్యార్థులను ఆకట్టుకున్న డాగ్ స్క్వాడ్ ప్రదర్శన

రామగుండంలో పోలీస్ ఓపెన్ హౌస్‌లో సిపి అంబర్ కిషోర్ ఝూ

రామగుండం, అక్టోబర్ 27(విజయ క్రాంతి) పోలీస్ అమరవీరుల సంస్మరణ ది నోత్సవం (ఫ్లాగ్ డే) కార్యక్రమాల్లో సోమవా రం రామగుండం పోలీస్ కమీషనరేట్ లో సీపీ అంబర్ కిషోర్ ఝా,  మంచిర్యాల డిసి పి భాస్కర్, పెద్దపల్లి డిసిపి కరుణాకర్ లతో కలిసి ఓపెన్ హౌస్ కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ విద్యార్థుల్లో చట్టపరమైన అవగాహన పెం చేందుకు గోదావరిఖని పట్టణంలో ని వివిధ కళాశాల,

పాఠశాలల విద్యార్థినీ విద్యార్థులు దాదాపు 1000 మంది ఓపెన్ హౌస్ కార్యక్రమంలో విద్యార్థులకు ప్రజా రక్షణ, భద్రత సంబందించిన పోలీసు చట్టాల గురించి, పోలీసు విధులపై, షీ టీమ్స్, భరోసా సెంట ర్స్, కమ్యూనికేషన్ సిస్టం, ఫింగర్ ప్రింట్ డివైస్ ల వల్ల కలిగే ఉపయోగాల గురించి, బీడీ టీమ్ ఎక్విప్మెంట్, డాగ్ స్క్వాడ్, ట్రాఫిక్ ఎక్విప్మెంట్, రోడ్డు ప్రమాదాలు స్పీడ్ లేజర్ గన్, ట్రాఫిక్ రూల్స్, ట్రాఫిక్ నిబంధనలు రోడ్డు నిబంధనలు,

సైబర్ నేరాలు, పోలీసు లు ఉపయోగిస్తున్న సాంకేతికత గురించి,  షీటీమ్, భరోసా, గంజాయి ఇతర మత్తు పదార్థాలకు సంబంధించిన కిట్, తదితర స్టాల్స్ ఏర్పాటు చేసి సంబంధిత అధికారు లు సిబ్బంది విద్యార్థులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించారు.  పోలీసులు కేవలం నేరస్థులను పట్టుకోవడానికే కాదని, సమాజంలో శాంతి భద్రతలు, చట్టపరమైన అవ గాహన పెంపు కోసం నిరంతరం కృషి చేస్తున్నారని, ప్రతి విద్యార్థి పోలీస్ వ్యవస్థ ఎలా పనిచేస్తుందో,

సమాజంలో భద్రత ఎలా సాధ్యమవుతుందో, తెలుసుకోవాలని సూ చించారు. విద్యార్థిని విద్యార్థులకు ప్రజల రక్ష ణ, భద్రత, మహిళ భద్రత, నేరాల నియంత్రణ నేరస్థుల పట్టుకోవడం కోసం పోలీసు లు చేస్తున్న విధుల గురించి, అదేవిదంగా ప్రతి ఒక్కరూ రోడ్డు నిబంధనలు ట్రాఫిక్ ని బంధనలు పాటించి రోడ్డు ప్రమాదాలను అ రికట్టాలని సైబర్ నేరాల వలలో పడకుండా తీసుకోవలసిన జాగ్రత్తల పై, సైబర్ నేరాలు సైబర్ మోసాలు ఎలా జరుగుతున్నాయో, సైబర్ నేరం జరగగానే 1930 టోల్ ఫ్రీ నెం బర్ ల గురించి, పోలీసు చట్టాలు పోలీసులు ప్రజలకు అందిస్తున్న సేవలు గురించి,

ట్రాఫి క్ నిబంధనలు పాటించకుండా రాంగ్ రూ ట్లో వస్తే ఎలా ప్రమాదాలు జరుగుతున్నా యి, హెల్మెట్ పెట్టుకోకపోతే ఎలా ప్రమాదాలు జరుగుతున్నాయి. బాలికలు మహిళ ల రక్షణకు ఏర్పాటుచేసిన భరోసా కేంద్రం యొక్క సేవల గురించి షీ టీమ్స్ పని తీరు గురించి వివరించారు.స్నిఫర్ డాగ్స్ తమ ప్ర తిభతో ఆకట్టుకోగా, విద్యార్థులు ఆసక్తిగా వీ క్షించారు. పోలీస్ చేపట్టిన ఈ ఓపెన్ హౌస్ విద్యార్థులను ఉత్సాహపరిచారు.ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ శ్రీనివాస్, ట్రాఫిక్ ఎసిపి శ్రీనివాస్, ఆర్ ఏసిపి ప్రతాప్,

సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, గోదావరిఖని 1-టౌన్ సీఐ ఇంద్రసేనా రెడ్డి, రామ గుం డము సిఐ ప్రవీణ్ కుమార్ , కమ్యూనికేషన్ ఇన్స్పెక్టర్ రాం ప్రసాద్, ఐటి కోర్ ఇన్స్పెక్టర్ చంద్ర శేఖర్ గౌడ్ , ఫింగర్ ప్రింట్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, ఆర్ ఐ లు దామోదర్ శ్రీనివాస్, వామన మూర్తి, శేఖర్, మల్లేశం, సంపత్, షీ టీమ్స్ ఎస్‌ఐ లు, కమీషనరేట్ పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షులు పోచలింగం, ఆర్‌ఎస్ ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.