21 April, 2026 | 6:48 PM

బడుగు బలహీన వర్గాల సమగ్ర ఆర్థిక అభివృద్ధియే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే బిఎల్ఆర్

21-04-2026 05:37 PM

మిర్యాలగూడ,(విజయక్రాంతి): అర్హులైన పేదలందరికీ  రాజకీయాలకతీతంగా పారదర్శకంగా  బడుగు బలహీన వర్గాల ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి (బిఎల్ఆర్) అన్నారు. మంగళవారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వేములపల్లి, మాడుగులపల్లి మండలాలకు చెందిన 60 మంది లబ్ధిదారులకు 60 లక్షల రూపాయలకు పైగా విలువ చేసే కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న ప్రజా పాలనలో ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీల అమలు తో పాటు ఉచిత సన్న బియ్యంపంపిణీ, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇం డ్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం తదితర సంక్షేమ పథకాలను అందిస్తూ ఆడపిల్లల పెళ్లిలకు తల్లిదండ్రులపై ఎలాంటి ఆర్థిక భారం పడకుండా ఉండేందుకే మహిళల ఆత్మ గౌరవాన్ని కాపాడటమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. వివిధ సంక్షేమ పథకాలలో లబ్ధి పొందిన లబ్ధిదారులే ప్రచార కార్యకర్తలుగా పనిచేసి ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రభుత్వానికి అండగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు, మండల నాయకులు,మాజీ ప్రజాప్రతినిధులు, బిఎల్ఆర్ బ్రదర్స్ తదితరులున్నారు.