21 April, 2026 | 6:36 PM

అకాల వర్షం ఈదురుగాలతో విద్యుత్ శాఖకు నష్టం

21-04-2026 05:34 PM

బోథ్,(విజయక్రాంతి): మంగళవారం మండలంలో కురిసిన అకాల వర్షాల వల్ల విద్యుత్ శాఖకు రూ.ఐదు లక్షల 50 వేల మేరకు నష్టం సంభవించిందని ఆదిలాబాద్ విద్యుత్ శాఖ డిఈ  ఈదన్న తెలిపారు. మంగళవారం భారీగా ఈదురుగాళ్లతో పాటు వర్షం కురవడంతో 22 విద్యుత్ స్తంభాలు విరిగిపోయినట్టు సమాచారం వచ్చిందన్నారు. అయితే విద్యుత్ స్తంభాలు విరిగిన చోట కొత్త స్తంభాలను వేయడం జరుగుతుందని తెలిపారు .మరల పెళ్లి రూట్ లో విద్యుత్ సరఫరాకు తగు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.ఆయన వెంట ఏడి లక్ష్మణ్ విద్యుత్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.