పెద్దమల్లారెడ్డి శివారులో స్టార్టర్ చోరీ
13-07-2026 06:48 PM
భిక్కనూర్,(విజయక్రాంతి): భిక్కనూర్ మండలం పెద్దమల్లారెడ్డి శివారులో రైతు రాఘ రామ్‌రెడ్డి పొలంలో ఉన్న మోటార్ స్టార్టర్‌ను గుర్తు తెలియని దుండగులు అపహరించారు. ఆదివారం సాయంత్రం మోటార్ ఆన్ చేసి తాళం వేసి వెళ్లిన రైతు, సోమవారం ఉదయం వచ్చి చూడగా తాళం పగులగొట్టి అందులోని ఆటోమేటిక్ పరికరం, స్టార్టర్‌ను దొంగిలించినట్లు గుర్తించారు. ఇటీవల వ్యవసాయ పరికరాల చోరీలు పెరుగుతున్నాయని, పోలీసులు నిందితులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.






