17 July, 2026 | 3:16 PM

ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్ పత్రాలు పంపిణీ

17-07-2026 03:16 PM

హర్షం వ్యక్తం చేసిన లబ్ధిదారులు 

పత్రాలు అందజేసిన సర్పంచ్ యాదమ్మ శ్రీనివాస్

ముస్తాబాద్,జూలై 17( విజయ క్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం ​పోతుగల్‌ గ్రామంలోని గ్రామపంచాయతీ వద్ద ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా మంజూరైన లబ్ధిదారులకు గ్రామ సర్పంచ్ పెద్దిగారి యాదమ్మ శ్రీనివాస్ ప్రొసీడింగ్ పత్రాలు పంపిణీ చేశారు.​రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా ప్రతి పేదవాడికి సొంతింటి కల నెరవేర్చడానికి ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తుందని సర్పంచ్ యాదమ్మ శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ సొంత స్థలం ఉండి ఇల్లు లేని నిరుపేదల సొంతింటి కల నెరవేర్చడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోందన్నారు.

ప్రొసీడింగ్ పత్రాలు అందుకున్న లబ్ధిదారులకు ఇండ్ల నిర్మాణానికి విడతలవారీగా రూ.5 లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లోనే జమ చేయనుందని తెలిపారు.తదుపరి మంజూరు అయ్యే ఇండ్లకు క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం పాలకవర్గం, ఇందిరమ్మ కమిటీ సభ్యులతో చర్చించి  అత్యంత పారదర్శకంగా లబ్ధిదారులను గ్రామసభలోనే ఎంపిక చేస్తామని తెలియజేశారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని త్వరగా గృహ నిర్మాణ పనులు ప్రారంభించుకోవాలని లబ్ధిదారులను కోరారు.

ప్రొసీడింగ్ పత్రాల పంపిణీ అనంతరం లబ్ధిదారుల గృహ నిర్మాణ స్థలాల్లో  భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు.మొదటి విడతలో ప్రొసీడింగ్ పత్రాలు అందుకున్న ​కృష్ణమాచారి,కేసుగాని హంస,​దొడ్ల జమున,​జంగ సుమలత నామాపురం సౌజన్య, కార్యదర్శి దేవరాజ్, పోతుగల్ కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు అనమేని రాజు,ఎన్ఆర్ఐ జిల్లా అధ్యక్షుడు ధర్మేందర్, కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ నాయకులు తలారి నరసయ్య, ఇందిరమ్మ కమిటీ సభ్యులు కిరణ్, చంద్రమౌళి, ఆంజనేయులు,వార్డ్ సభ్యుడు జంగరాజు,మాధవరావు, విద్యాధర్,బాలకృష్ణ,గ్రామ ప్రజలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.