సోయాబీన్ పంటను పరిశీలించిన వ్యవసాయ అధికారి
బోథ్, జూలై 17 (విజయక్రాంతి): వర్షాభావ పరిస్థితుల వల్ల సోయాబీన్ పంట కు తెగులు సోగడంతో విజయ క్రాంతి పత్రికలో ప్రచురితమైంది.దీంతో శుక్రవారం మండలంలోని కౌటబి గ్రామంలో వ్యవసాయ అధికారి ఏఈఓ వాజిద్ పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో కలిసి పలువురి సోయా పంట పొలాలను పరిశీలించడం జరిగింది.ప్రస్తుతం పంటపై లద్దె పురుగు అభివృద్ధి ఉందని గమనించారు.అంతేగాక ఇనుము దాతులోపం పంటకు ఉండడంతో ఆకు పచ్చగా మారుతుందని గుర్తించారు.మైక్రో న్యూట్రిన్స్ మిశ్రమం ఎకరానికి 10 కిలోల చొప్పున పిచికారి చేయాలని రైతులకు సూచించారు.లద్దె పురుగు నివారణకు గుడ్ల గుంపు చిన్న లార్వాలను నాశనం చేయాలని వివరించారు మధ్య పురుగు ఉధృతి పెరిగితే బెంజోమేట్ ఐదు శాతం ఎస్ జి 80 గ్రాములు ఎకరానికి ఒక ఒక 150 నుండి 200 లీటర్లలో నీటిలో కలిపి పిచికారి చేయాలని సూచించారు. సాక్ష్యం చేస్తే రైతులు నష్టపోతారని వెంటనే మందులు పిచికారి చేయాలని సూచించారు.






