17 July, 2026 | 2:55 PM

ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని బాధ్యతగా నిర్వహించండి

17-07-2026 02:55 PM

- దిండిగల రాజేందర్

గుండాల, (విజయక్రాంతి): బీఆర్ఎస్ పార్టీ బీఎల్ఏ ప్రతి కార్యకర్త బాధ్యతగా వ్యవహరించి ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని పినపాక నియోజకవర్గం ఎస్ఐఆర్ కార్యక్రమ ఇంఛార్జ్ దిండిగల రాజేందర్ కార్యకర్తలకు సూచించారు. గురువారం మండల కేంద్రంలో ఆయన పాల్గొని బీఎల్ఏలు ఎస్ఐఆర్ కార్యక్రమంలో ఏ విధంగా పాల్గొంటున్నారని ఆయన స్వయంగా పరిశీలించారు. అనంతరం కార్యకర్తలు, బీఎల్ఏ లతో సమావేశం నిర్వహించి ఆయన మాట్లాడుతూ.. ప్రజల వద్దకు వెళ్లి ఎస్ఐఆర్ కార్యక్రమంపై అవగాహన కల్పించాలని, ప్రతీ ఓటరు ఓటు పోకుండా జాగ్రత్తగా వారి ఫారాలను బీఎల్ఓ లకు అందజేయాలని అన్నారు. ఓటర్లకు ఏదైనా సందేహాలు ఉంటే వాటిని వివరించి వాటిని పరిష్కరించాలని కోరారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో నిరంకుశ పాలన సాగిస్తుందని అన్నారు.

గత బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నిలిపిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన చేసిన అభివృద్ధిని ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కొనసాగించడంలో పూర్తిగా విఫలమైందని అన్నారు. ప్రశ్నించే కార్యకర్తలను అక్రమ అరెస్టులు చేసి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, అక్రమ కేసులకు భయపడే ప్రసక్తే లేదని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు తెల్లం భాస్కర్, మాజీ రైతు సమన్వయ సమితి అధ్యక్షులు మోకాళ్ళ వీరస్వామి, పార్టీ నాయకులు గడ్డం వీరన్న, ఏడూర్ల బుచ్చి రాములు, యువజన విభాగం అధ్యక్షులు సయ్యద్ అజ్జు, బీసీ సెల్ అధ్యక్షులు గడ్డం రమేష్, కుంజ సుధాకర్, కుంజ నాగేశ్వరరావు, జాడి ప్రభాకర్, కల్తి కుమార్, మోకాళ్ళ నరేష్, కుంజ సుధాకర్, బానోత్ కాలు, వాంకుడోత్ శ్రీను, దనసరి భాస్కర్, బొమ్మెర సతీష్, గంగాధరి ప్రమోద్ తదితరులు పాల్గొన్నారు.